Telangana: తెలంగాణలో జోరుగా నకిలీ విత్తనాల దందా

Telangana: కలర్ ఫుల్ లేబుల్స్‌తో నకిలీ విత్తనాల విక్రయాలు

Update: 2023-06-14 07:33 GMT

Telangana: తెలంగాణలో జోరుగా నకిలీ విత్తనాల దందా

Telangana: తెలంగాణలో నకిలీ విత్తనాల అమ్మకాలు రైతు పాలిట శాపంగా మారాయి. అధికారులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా..నకిలీ విత్తన వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ప్రతి రోజూ ఒకో దగ్గర నకిలీ విత్తనాలు పట్టుబడుతున్నాయి. పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలతో ప్రభుత్వం నకిలీ విత్తనాలు సప్లై చేస్తున్న వారిపై ఉక్కపాదం మోపుతున్నా... అధికారుల కళ్లు గప్పి విక్రయాలు సాగిస్తున్నారు.

వానాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పంటలు వేసే సమయం దగ్గర పడుతోంది. అయితే, వానలు పడే కంటే ముందే రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తారు. ఇదే అదునుగా దళారులు నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో పత్తి సాగు ఎక్కువగా చేస్తారు.. దీంతో ఆయా జిల్లాలో విత్తనాలు ఎక్కువగా అవసరవుతాయి. అయితే ఇదే అదునుగా చేసుకొని దళారులు నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నారు. ఏవి నకిలీ విత్తనాలో... ఏవి నకిలీ విత్తనాలో తేల్చుకోలేక రైతులు ఆయోమయానికి గురవుతున్నారు.

కలర్ ఫుల్ లేబుల్స్ వేసి అందంగా ఫ్యాక్ చేసి నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నాక కానీ అవి నకిలీ విత్తనాలని తెలియడంలేదు. దీంతో వేసిన పంట మొలకెత్తక, మొలకెత్తిన పంట దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. SeedsSeeds 

Tags:    

Similar News