ఇద్దరి ప్రాణాలు తీసిన ఫేస్‌ బుక్‌ చాటింగ్

ఫేస్ బుక్ చాటింగ్ ఇద్దరి ప్రాణాలు తీసింది. ఫేస్‌బుక్‌ చాటింగ్‌.. ఒకరి హత్య.. మరొకరి ఆత్మహత్యకు కారణమైంది. గద్వాల పట్టణానికి చెందిన

Update: 2020-02-29 16:20 GMT

ఫేస్ బుక్ చాటింగ్ ఇద్దరి ప్రాణాలు తీసింది. ఫేస్‌బుక్‌ చాటింగ్‌.. ఒకరి హత్య.. మరొకరి ఆత్మహత్యకు కారణమైంది. గద్వాల పట్టణానికి చెందిన వివాహిత సుధారాణికి కార్తీక్ కొన్ని నెలల క్రితం ఫేస్‌ బుక్‌ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇదే సందర్భంలో ఫేస్‌ బుక్‌ ద్వారా మరో వ్యక్తి రవి సుధారాణికి పరిచయం అయ్యాడు. వీరి మధ్య కూడా వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో కార్తీక్‌ సుధారాణిని డబ్బుల కోసం వేధిస్తున్నట్లు తెలిసింది.

ఇదే సందర్భంలో కార్తీక్‌ గద్వాల మండలం నెట్టెంపాడు కాలువ దగ్గర శవమయ్యాడు. అతన్ని దారుణంగా చంపి పూడ్చిపెట్టారు. కార్తీక్‌ను రవితో పాటు మరో ఇద్దరు కలిసి చంపారని మృతుని బంధువులు ఆరోపించారు.

ఇటు మహబూబ్‌నగర్‌లో సుధారాణి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన ఆత్మహత్యకు గల కారణాలను సూసైడ్ లెటర్‌లో వివరించింది సుధారాణి. కార్తీక్ హత్య విషయం తెలిసి ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిసింది. కార్తీక్‌ హత్య, సుధారాణి ఆత్మహత్యపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. 

Tags:    

Similar News