Etela Rajender: బీజేపీ ఎంపీతో భేటీ అయిన ఈటల
మాజీ మంత్రి ఈటల పలువురు రాజకీయ నేతలను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
ఈటెల రాజేందర్ & ఎంపీ అరవింద్ (ఫైల్ ఇమేజ్)
Etela Rajender: మాజీ మంత్రి ఈటల పలువురు రాజకీయ నేతలతో వరుసగా భేటీలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈటలపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ విచారణ జరుగుతున్న క్రమంలోనే ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈ క్రమంలో తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లో కార్యకర్తలు, నేతలతో చర్చించిన ఆయన పలువురు రాజకీయ నేతలను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
తాజాగా ఆయన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో సమావేశం అయ్యారు. వీరి భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించనట్లు తెలుస్తోంది. అంతకు ముందు రాజ్యసభ సభ్యులు డీ.శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన ఈటల గంట పాటు ఆయనతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్‌ను సైతం ఈటల కలిశారు
ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిలతో కూడా ఈటల భేటీ అయిన విషయం తెలిసిందే. మంగళవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై భట్టి విక్రమార్కతో ఈటల చర్చించారు. ఇలా అన్ని పార్టీల నేతలను కలుస్తుండడంతో ఏ పార్టీలో చేరతారా లేదా సొంతంగా పార్టీ పెట్టే ఆలోచన వుందా అనే ఆశక్తి అందిరిలో నెలకొంది.