కరోనా వైరస్‌ సమూహ వ్యాప్తి చెందలేదు : మంత్రి ఈటల

తెలంగాణలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులన్నీ మర్కజ్ నుంచి వచ్చిన వారే అని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2020-04-05 04:22 GMT
Etela Rajendar(file photo)

తెలంగాణ లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులన్నీ మర్కజ్ నుంచి వచ్చిన వారే అని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో కేసులు స్థానికంగా వ్యాప్తి చెందలేదని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మర్కజ్‌ నుంచి వచ్చిన వారిని 1,090 మందిని గుర్తించి క్వారంటైన్ కి పంపించామని ఆయన అన్నారు. వారందరి రక్త నమూనాలను పరీక్షలకు పంపించామన్నారు. శుక్రవారం చనిపోయిన ఇద్దరు వ్యక్తులు ఢిల్లీ మర్కజ్ నుంచి వచ్చినవారితో కలిసిన వారేనని ఆయన స్పష్టంచేశారు.

కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరిని ఐసోలేషన్ కు పంపిస్తున్నామని, రాష్ట్రంలో ఏర్పాటు చేసిన అన్ని పర్యవేక్షణ కేంద్రాల్లో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందిని నియమించామన్నారు. వారితో పాటుగానే అన్ని కేంద్రాల్లో ఎన్‌- 95 మాస్కులు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు.

కరోనా బాధితులకు వైద్యం అందించేందుకు 500 వెంటిలేటర్లు, 5 లక్షల పీపీఈ కిట్లు, 4 లక్షల కరోనా టెస్టింగ్‌ కిట్లు, 5 లక్షల ఎన్‌- 95 మాస్కులు, 5 లక్షల వైరల్‌ ట్రాన్సిషన్‌ కిట్లు, 20 లక్షల సర్జికల్‌ మాస్కులు, 25 లక్షల హ్యాండ్‌ గ్లౌసెస్‌ కొనుగోలు చేశామని తెలిపారు. ఇక ఎన్ని పాజిటివ్‌ కేసులు వచ్చినా బాధితులకు చికిత్స అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వైద్యులపై ఎవరైనా దాడికి దిగితే సహించేది లేదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వైద్యులు, వైద్య సిబ్బంది భద్రత తమ బాధ్యత అని పేర్కొన్నారు.

ప్రతి రోజు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు వైద్య శాఖ అధికారులతో, సీఎస్ లతో సీఎం ఆదేశాల మేరకు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నామన్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో అన్ని ఆస్పత్రుల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డు లను ఏర్పాటు చేసామని, ఈ నేపథ్యంలోనే గచ్చిబౌలి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో 1,500 బెడ్ల దవాఖాన రెడురోజుల్లో అందుబాటులోకి వస్తుందని స్పష్టంచేశారు.

Tags:    

Similar News