Raja Singh: పార్టీ మారబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో రాజాసింగ్‌తో ఈటల భేటీ
Raja Singh: బీజేపీ సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో.. పార్టీ మారుతారనే వార్తలు
Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బుజ్జగించేందుకు బీజేపీ చర్యలు తీసుకుంటుందా..? అందులో భాగంగానే ఈటల రాజేందర్, రాజాసింగ్‌ను కలిశారా..? ఇవాళ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో ఈటల భేటీ వెనుక ఇదే కారణమనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొంటున్న రాజాసింగ్ ఇటీవల మంత్రి హరీశ్ రావుతో భేటీ అయ్యారు. దీంతో ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం ఊపందుకుంది. ఆ వార్తలను రాజాసింగ్ ఖండించినా... అసలు ముచ్చట వేరే ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈటల రాజాసింగ్‌తో భేటీ అయి ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడంపై ఈటలతో చర్చించానంటున్నారు రాజాసింగ్. గోషామహల్ అభివృద్ధి కోసమే మంత్రులను కలుస్తున్నానని మరోసారి స్పష్టం చేశారు.