Vote for Note Case: చంద్రబాబుకు ఊరట..రేవంత్ రెడ్డిపై ఈడీ చార్జీషీట్

Vote for note Case:మే 31, 2015న స్టీఫెన్ సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ పట్టుబడిన రేవంత్ రెడ్డి

Update: 2021-05-27 10:51 GMT

రేవంత్ రెడ్డి (thehansindia)

Vote for Note Case: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ చార్జీషీట్‌లో రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా ఈడీ పేర్కొంది. ఛార్జీషీట్‌లో రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, అతని కుమారుడు వేం కృష్ణ, కీర్తన రెడ్డి, సెబాస్టియన్‌ల పేర్లను పొందుపరిచారు. 2015 మే 21న స్టీఫెన్ సన్‌కు 50 లక్షల రూపాయలు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా రేవంత్ రెడ్డి పట్టుపడ్డారు. ఈ కేసులో చంద్రబాబు పేరును కూడా చేర్చారు

అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా... టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసేందుకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేశారన్నది రేవంత్ రెడ్డి, తదితరులపై ఉన్న ప్రధాన అభియోగం.కాగా, ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రపైనా ఏసీబీ విచారిస్తోంది. ఆయన స్టీఫెన్ సన్ తో మాట్లాడినట్టుగా భావిస్తున్న ఆడియో టేప్ ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపడం తెలిసిందే.

అప్ప‌ట్లో వీడియో ఆధారాలు బట్టబయలు కాగా, ఈ కేసులో రేవంత్ రెడ్డి కొంతకాలం జైలులో కూడా ఉన్నారు. బెయిల్ పై బయటికి వచ్చిన ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. నేడు దాఖలు చేసిన చార్జిషీటులో రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా ఈడీ పేర్కొంది.

అయితే, ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు కాస్త ఊరట కలిగినట్లయింది. ఏసీబీ చార్జ్‌షీట్‌లో చంద్రబాబు పేరు కనిపించలేదు. ఈ కేసులో ఎంపీ రేవంత్‌రెడ్డిపై ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి 50 లక్షలు ఇచ్చినట్టు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. మండలి ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ చేసే విధంగా.. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రాయబారం నడిపినట్టుగా రేవంత్‌రెడ్డిపై చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

Tags:    

Similar News