జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ బీఆర్‌ఎస్ నేతల ఇళ్లల్లో రైడ్స్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ బీఆర్‌ఎస్ నేతల ఇళ్లల్లో రైడ్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్‌రావు ఇళ్లల్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ ఉంచినట్టు ఫిర్యాదు రావడంతో మోతీనగర్‌లోని మర్రి జనార్ధన్ ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతోంది. కేంద్ర బలగాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు.
అటు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. కూకట్‌పల్లి బీఎస్పీ కాలనీలోని రవీందర్ నివాసంలో తనిఖీలు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోలేని ప్రాంతంలో సోదాలు చేస్తుండటంపై రవీందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇంట్లోకి ఎలా వస్తారంటూ రవీందర్ నిలదీశారు.