Bhoodan Land Scam: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి ఈడీ నోటీసులు

Bhoodan Land Scam: భూదాన్ భూముల కుంభకోణంలో నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి(Marri Janardhan Reddy)కి ఈడీ నోటీసులు జారీ చేసింది.

Update: 2024-12-13 05:31 GMT

Bhoodan Land Scam: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి ఈడీ నోటీసులు

Bhoodan Land Scam: భూదాన్ భూముల కుంభకోణంలో నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి(Marri Janardhan Reddy)కి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మరో ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 16న విచారణకు రావాలని ఈడీ కోరింది.

భూదాన్ భూముల వివాదం ఏంటి?

హైదరాబాద్ మహేశ్వరం మండలం నాగారంలోని 181, 182లోని 102.2 ఎకరాలకు పైగా కొంతకాలంగా వివాదం నడుస్తోంది.ఇందులోని 50 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని ఈడీ అధికారులు గుర్తించారు. ఈ 100 ఎకరాల్లో 50 ఎకరాలు తమ భూమి అని భూదాన్ బోర్డు వాదిస్తోంది. అయితే ఈ భూమి జబ్బార్ధస్త ఖాన్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. తర్వాతి కాలంలో జబ్బర్దస్తూ ఖాన్ కొడుకు హజీఖాన్ 50 ఎకరాలు ల్యాండ్ ను భూదాన్ బోర్డుకు దానం చేశారని చెబుతున్నారు.

అయితే 2021లో హజీఖాన్ వారసురాలిని అంటూ ఖాదరున్నీసా అనే మహిళ దరఖాస్తు చేశారు. అధికారులు ఈ భూమిని ఆమె పేరున రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత ఈ భూమి రియల్ ఏస్టేట్ కంపెనీ చేతుల్లోకి వెళ్లింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ భూమిపై ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తహసీల్దార్ జ్యోతి, జాయింట్ సబ్ రిజిస్ట్రార్, రియల్ ఏస్టేట్ సంస్థ యజమాని కె. శ్రీధర్ పై కేసు నమోదు చేసింది. ఈ కేసుల్లో ఆర్ధిక లావాదేవీలు జరగడంతో ఈడీ రంగంలోకి దిగింది. తొలుత విజిలెన్స్ విచారణలో భూదాన్ భూముల అన్యాక్రాంతం వెలుగు చూసింది. ఆ తర్వాత ఈడీ విచారించింది. 2024 నవంబర్ లో ఈడీ తెలంగాణ డీజీపీకి నివేదికను అందించింది. ఈ కేసులో ఇప్పటికే ఐఎఎస్ అధికారి అమోయ్ కుమార్ ను ఈడీ విచారించింది.

Tags:    

Similar News