Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌కు బిగుస్తున్న ఉచ్చు.. కేంద్ర దర్యాప్తు సంస్థ నోటీసులు!

Chikoti Praveen: ఈనెల 1న పట్టాయాని ఓ హోటల్‌లో క్యాసినో నిర్వహించిన చికోటి

Update: 2023-05-09 04:37 GMT

Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌కు బిగుస్తున్న ఉచ్చు.. కేంద్ర దర్యాప్తు సంస్థ నోటీసులు!

Chikoti Praveen: క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. తాజాగా థాయ్‌లాండ్‌లో క్యాసినో నిర్వహించిన ఘటనపై ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. చికోటితో పాటు మెదక్ డీసీసీబీ ఛైర్మన్ దేవందర్ రెడ్డి, సంపత్, మాధవ రెడ్డిలకు సైతం ఈడీ నోటీసులు జారీ చేసింది. సంపత్ ఇప్పటికే విచారణకు హాజరు కాగా.. మిగితా ముగ్గురు విచారణకు హాజరు కావాల్సి ఉంది. చికోటి ప్రవీణ్ ఈ శుక్రవారం ఈడీ విచారణకు హాజరయ్యే అకవాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈనెల 1న థాయ్‌లాండ్‌లోని లాముంగ్‌ జిల్లా ఆసియా పట్టాయా పట్టణంలోని ఓ హోటల్‌లో గుట్టు చప్పుడు కాకుండా క్యాసినో నిర్వహిస్తుండగా థాయ్ పోలీసులు దాడి చేశారు. మొత్తం 93 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 83 మంది భారతీయులు పట్టుబడ్డారు. అరెస్టయిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. చికోటి ప్రవీణ్‌‌తో పాటు అతని అనుచరుడు మాధవరెడ్డి, మెదక్‌ డీసీసీబీ ఛైర్మన్‌ చిట్టి దేవేందర్‌ రెడ్డి, గాజుల రామారంకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి వాసుతో పాటు పలువురు మహిళలు కూడా ఉన్నారు.

హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ వెళ్లటానికి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఖర్చుల నిమిత్తం 3 లక్షల వసూలు చేసినట్లు చికోటి ప్రవీణ్‌పై ఆరోపణలు ఉన్నాయి. వారిని అక్కడికి తీసుకువెళ్లి గ్యాంబ్లింగ్ నిర్వహించినట్లు గుర్తించారు. పక్కగా నిఘా ఉంచిన థాయ్ పోలీసులు.. వారు క్యాసినో నిర్వహిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 50 కోట్ల విలువైన గ్యాంబ్లింగ్ చిప్స్, లక్ష అరవై వేల ఇండియన్ కరెన్సీ, జూదం క్రెడిట్‌ల రికార్డులు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇటీవల చికోటికి బెయిల్ మంజూరు కాగా.. థాయ్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.

Tags:    

Similar News