Sheep Scam: తెలంగాణలో గొర్రెల కుంభకోణంపై ఈడీ సంచలన ప్రకటన
Sheep Scam: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీలో భారీ అవినీతి వెలుగు చూసింది.
Sheep Scam: తెలంగాణలో గొర్రెల కుంభకోణంపై ఈడీ సంచలన ప్రకటన
Sheep Scam: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీలో భారీ అవినీతి వెలుగు చూసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజా దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, ఈ స్కీం ద్వారా రూ. 1000 కోట్లకుపైన అక్రమ లావాదేవీలు జరిగినట్లు తేలింది.
ఈ క్రమంలో, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సన్నిహితుడైన ఓఎస్డీ కల్యాణ్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో:
200కుపైగా బ్యాంకు ఖాతాల పాస్‌బుక్‌లు
31 మొబైల్ ఫోన్లు
20 సిమ్ కార్డులు
అంతేకాకుండా, 33 జిల్లాల్లోని లబ్ధిదారులకు పంపించాల్సిన నిధులను కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లించారని ఈడీ గుర్తించింది. స్కీం ఉద్దేశాన్ని వక్రీకరించి వేల కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలోనే మరిన్ని కీలక రాజకీయ నాయకులు ఈ కేసులో విచారణకు ఎదురయ్యే అవకాశం ఉందని సమాచారం.