Mulugu Eco Park: 200 ఎకరాల్లో " ఈకో పార్క్" రెడీ

ములుగు జిల్లా ఇంచర్ల ఎర్రిగట్టమ్మ దగ్గర ఈకో పార్క్ ఏర్పాటు జిల్లా ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో 200 ఎకరాల్లో ఈకో పార్క్ ఇంచెర్ల ఎర్రిగట్టమ్మ దగ్గర రూ.2.50 కోట్ల నిధులతో పార్క్

Update: 2025-11-20 06:42 GMT

Mulugu Eco Park: 200 ఎకరాల్లో " ఈకో పార్క్" రెడీ 

పర్యాటకుల సౌకర్యార్థం, చిన్నపిల్లలకు పైడిల్ బోటింగ్‌తో పాటు..

ఓపెన్ స్కూల్, ఈకో పార్క్ వ్యూకు వాచ్ టవర్, బటర్‌ఫ్లై పార్క్

డిసెంబర్ లోపు ఈ-కో పార్క్ ప్రారంభం- రేంజ్ ఆఫీసర్ డోలి శంకర్


టూరిస్ట్ హబ్‌గా ఉన్న ములుగు జిల్లా ఇంచర్లలో సీసీఎఫ్, డీఎఫ్‌వో రాహుల్ కిషన్ ఆధ్వర్యంలో 200 ఎకరాల్లో ఈకో పార్క్ ఏర్పాటు చేశామన్నారు ములుగు రేంజ్ ఆఫీసర్ డోలి శంకర్. ఇంచర్ల ఎర్రిగట్టమ్మ దగ్గర 2 కోట్ల 50 లక్షలతో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈకో ఏర్పాటు చేశారు. ప్రకృతి అందాలను చూడటానికి వాచ్ టవర్, నక్షత్ర వనం, బటర్‌ఫ్లై పార్క్, వాకింగ్ పాత్, పగోడాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు రేంజ్ ఆఫీసర్. డిసెంబర్ లోపు ఈకో పార్కును అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 

Tags:    

Similar News