Election Code: ఉప ఎన్నికల్లో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనపై ఈసీ సీరియస్
Election Code: నియోజకవర్గ పక్క ప్రాంతాల్లో కార్యక్రమాల అమలుపై అసంతృప్తి
ఉపఏన్నికల్లో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనపై ఈసీ సీరియస్ (ఫైల్ ఇమేజ్)
Election Code: ఉప ఎన్నికల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలకు పక్కనే ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యక్రమాల అమలును తప్పు బట్టింది. ఎన్నికల కోడ్ ఒక నియోజకవర్గానికే కాదని నియోజకవర్గం ఉన్న జిల్లా మొత్తానికి వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఎన్నికల నియమావళి కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.