హెల్మెట్ ధరిస్తే ఇక నో చెకింగ్ ....

Update: 2019-09-14 05:52 GMT

వాహనదారులకు పోలీసు ఉన్నతాధికారులు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు . హెల్మెట్ ధరించి వాహనాలు నడిపితే ఇతర పత్రాల కోసం వారిని తనిఖి చేయవద్దని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ట్రాఫిక్ పోలీసులకు ఆదేశించారు. .. హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను పెంచేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయన తెలిపారు .

దీనివల్ల హెల్మెట్ వాడకం పెరిగే అవకాశాలు ఉన్నాయని అయన ఆశాభావం వ్యక్తం చేసారు . వాహనదారులను తదుపరి ఆదేశాల వరకు తనిఖీల నుంచి కొంతకాలం మినహాయింపు ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. ఇక హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే మాత్రం ఉరుకోవద్దని వారికి జరిమానా విధిస్తునే వాహనానికి సంబంధించిన ధృవపత్రాలను చెకింగ్ చేయాలనీ పోలీస్ అధికారులకు ఆదేశించారు...  

Tags:    

Similar News