బాగ్‌లింగంపల్లిలో డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన తెలంగాణ మంత్రులు
double bedroom houses inaguration
హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని లంబాడితండాలో డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్రమంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఏ రాష్ట్రంలో జరగని విధంగా 18వేల కోట్లతో డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 2 లక్షల వరకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టామని పేదలు ఆత్మగౌరవంతో ఉండాలనే డబల్ బెడ్‌రూమ్ ఇళ్లకు శ్రీకారం చుట్టామన్నారు మంత్రి కేటీఆర్. ఎన్నికలప్పుడు ఎవరివాదన వారు చెబుతామన్న కేటీఆర్ ఎన్నికల తర్వాత ప్రజల అభివృద్ధి, సంక్షేమం తప్ప అనవసర పంచాయతీలు పెట్టుకోవడం సరికాదన్నారు. ప్రజల ఆశీర్వాదం కోసం పోటీ పడదాం కానీ ఎన్నికల తర్వాత అన్నదమ్ముల్లా కలిసిమెలిసి పనిచేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు.