డీకే అరుణ వెరైటీ నిరసన

Update: 2019-09-05 11:43 GMT

గద్వాల జిల్లా కేంద్రంలో ఏళ్లు గడుస్తున్నా రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తి కాకపోవడంపై బీజేపీ ఆందోళనకు దిగింది. ఆరో వోబీ రోడ్డు మార్గంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు డీకే అరుణ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. కనీసం రోడ్ల గుంతలు కూడా పూడ్చని స్థితికి తెలంగాణ ప్రభుత్వం చేరుకుందని డీకే అరుణ ఆరోపించారు.

గద్వాలలో రెండవ రైల్వే గేటు దగ్గర చిన్నపాటి వర్షానికి బురద మయంగా మారిన రోడ్లను బీజేపీ కార్యకర్తలతో కలిసి డీకే అరుణ పరిశీలించారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గర పనులు పూర్తి కాక పోవడం, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగడం గమనించారు. పనులు పూర్తి కానీ ఆర్ వోబీ మార్గంతో పాటు బురదమయమైన రోడ్లపై డీకే అరుణ వరినాట్లు వేశారు.

ఐదేళ్ల క్రితం తాను మంత్రిగా ఉన్నప్పుడు ఆరోవోబీకి శంకుస్థాపన చేశానని, ఐదేళ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తి కావడంపై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్వాలలో ప్రధాన రహదారులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయని, వాహనదారులు నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రోడ్లపై గుంతలను కూడా పూడ్చేలేని స్థితికి దివాళ తీసిందా అని ప్రశ్నించారు. తక్షణం ఆర్ వోబీ నిర్మాణాన్ని పూర్తి చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని డీకే అరుణ హెచ్చరించారు.

Full View 

Tags:    

Similar News