దిశ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ : హ‌ర్షం వ్యక్తం చేసిన దిశ త‌ల్లిదండ్రులు

దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన సంఘటనా స్థలానికి సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను

Update: 2019-12-06 03:49 GMT
Accused encounter

దిశ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. కాగా గత నెల 27న వెటర్నరీ వైద్యురాలిపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద కాల్చివేశారు.

విచారణలో భాగంగా దుర్ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు నిందితులను తీసుకు వెళ్లి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా... వారు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు దాడికి యత్నించారు. దీంతో వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో ప్రధాన నిందితుడు ఆరిఫ్, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన సంఘటనా స్థలానికి సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఎన్‌కౌంటర్‌పై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా దిశను చంపిన ప్రాంతంలోనే నిందితులు ఎన్‌కౌంటర్‌ అయ్యారు.షాద్‌నగర్ పట్టణ శివారులోని చటాన్‌పల్లి వద్ద నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన నేపథ్యంలో జనాలు తండోపతండాలుగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 44వ నంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. దిశ‌ని కాల్చిన చోటే నిందితులని ఎన్‌కౌంట‌ర్ చేయ‌డంతో దిశ త‌ల్లిదండ్రులు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News