Congress: రాహుల్ సభ సాక్షిగా బయటపడ్డ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ లోపాలు

Congress: ఒకరినొకరు తోసుకుంటూ విచిత్ర ప్రవర్తన

Update: 2023-07-03 07:05 GMT

Congress: రాహుల్ సభ సాక్షిగా బయటపడ్డ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ లోపాలు

Congress: గాంధీభవన్‌లో మాత్రమే కాదు.. ప్రజాక్షేత్రంలో సైతం మా పార్టీలో కుమ్ములాటలు కామనే అన్నట్లు వ్యవహిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా సమయం వచ్చిన ప్రతీసారి విచిత్ర ప్రవర్తనతో కేడర్‌కే విసుగు తెప్పిస్తున్నారు. ప్రాధాన్యత కోసం వేదికపైనే పాకులాడుతూ విమర్శల పాలవుతున్నారు.

క్రమశిక్షణగా ఉండాలని అధినాయకత్వం ఎన్నిసార్లు చెబుతున్నా.. మాట వినడం లేదు. ఏకంగా అగ్రనాయకుల ముందే విచిత్రంగా ప్రవర్తిస్తూ విమర్శలు మూటగట్టుకుంటున్నారు. రాహుల్ సభ సాక్షిగా కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణా లోపాలు బయటపడ్డాయి. తెలంగాణ కాంగ్రెస్‌లోని అగ్రనేతల మధ్య సఖ్యత లేదని మరోసారి బయటపడింది. సభ వేదికపై...రాహుల్ పక్కన ఉండగానే ఒకరినొకరు తోసుకుంటూ విచిత్రంగా ప్రవర్తించారు. తమ ప్రవర్తనతో పాత,కొత్త, రీఎంట్రీ నాయకులు విసుగు తెప్పించారనే విమర్శలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News