Digvijaya Singh: ఇద్దరు బీఆర్‌ఎస్ ఎంపీలే తెలంగాణను సాధించారా..?
Digvijaya Singh: తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోంది
ఇద్దరు బీఆర్‌ఎస్ ఎంపీలే తెలంగాణను సాధించారా..?
Digvijaya Singh: తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అలాంటి కాంగ్రెస్ నేతలను కేసీఆర్ ఇష్టారాజ్యంగా కొనుగోలు చేశారన్నారు దిగ్విజయ్ సింగ్. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో వాగ్దానాలు ఇచ్చిన కేసీఆర్ వాటిని మరిచిపోయారన్నారు. ఇప్పుడు దేశంలో బీజేపీ కూడా ఇదే చేస్తుందన్నారు. పార్లమెంట్‌లో బీఆర్ఎస్ బీజేపీని సమర్థిస్తుందని ఆరోపించారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అందరు ఐక్యంగా పనిచేస్తేనే గెలుపు సాధిస్తామన్నారు దిగ్విజయ్. పార్టీలో ఏమైనా విభేదాలుంటే బయట కాకుండా, అంతర్గతంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. అందరూ కలిసికట్టుగా ప్రజల పక్షాన పోరాడాలని పిలుపునిచ్చారు.