Digvijaya Singh: కేంద్ర పై విమర్శలు.. రైతుల సమస్యలు పట్టించుకోవడంలేదు..
Digvijaya Singh: హైదరాబాద్ గాంధీ భవన్‌లో దిగ్విజయ్ మీడియా సమావేశం
Digvijaya Singh: కేంద్ర పై విమర్శలు.. రైతుల సమస్యలు పట్టించుకోవడంలేదు..
Digvijaya Singh: మోదీ ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవడంలేదని సీడబ్ల్యూసీ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. కేవలం కార్పొరేట్ల కోసమే మోదీ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. తమ హక్కుల సాధన కోసం ఆందోళన చేస్తున్న హర్యానా రైతులపై ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తోందన్నారు. గాజా పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు మాదిరిగా రైతులపై ప్రభుత్వం దాడులు చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఎవరైనా విమర్శలు చేస్తే వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దిగ్విజయ్ ఆరోపించారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.