విధుల్లోకి చేర్చుకోవాలని ఆర్టీసీ కార్మికుల ధర్నా

నిన్న మొన్నటి వరకూ తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు తమను విధుల్లోకి తీసుకోవాలని ధర్నాలు నిర్వహిస్తున్నారు.

Update: 2019-11-27 10:06 GMT
ధర్నా చేస్తున్న ఆర్టీసీ కార్మికులు

నిన్న మొన్నటి వరకూ తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు తమను విధుల్లోకి తీసుకోవాలని ధర్నాలు నిర్వహిస్తున్నారు. వారు చేసిన సమ్మెతో డిమాండ్లను సాధించుకోకపోగా తమ ఉద్యోగాలనే పోగొట్టుకునే  పరిస్థితి నెలకొంది. 53 మూడు రోజులుగా సమ్మెచేసినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో కార్మికులు ఎలాంటి షరతులు లేకుండా తమను విధుల్లోకి తీసుకోవాలంటూ సమ్మెను విరమించారు.

వారు సమ్మె విరమించి నాలుగు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కార్మికులను ఆర్టీసీ యాజమాన్యం విధుల్లోకి తీసుకోవడంలేదు అలాగే వారి కుటుంబాలు ఇప్పటికే ఆర్థికంగా వెనుకబడి కనీసం తిండి కూడా దొరకని పరిస్థితితో కొంతమంది కార్మికులు కుటుంబాలు ఉంటున్నాయి. దీంతో దిక్కు తోచని కార్మికులు వారిని విధుల్లోకి తీసుకోవాలంటూ రెండురోజులుగా డిపోల ఎదుట ఆందోళనకు దిగుతున్నారు.అధికారులను వేడుకుంటున్నారు.

దీంతో డిపోల వద్దకు భారీగా మోహరించిన పోలీసులు కార్మికులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్, హకీంపేట డిపోల  వద్ద కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. జేబీఎస్ వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరికొన్ని చోట్ల కార్మికుల ఇండ్లలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. అంతే కాక ఎక్కడైనా కార్మికులు సమావేశం నిర్వహించనట్లయితే వారిని వెంటనే అదుపులోకి తీసుకుంటుంన్నారు. ఇదిలా ఉంటే ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సీఐటీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు.

ఇదిలా ఉంటే ఆర్టీసీ యాజమాన్యం ప్రజలకు ఎలాంటి రావాణా పరమైన ఇబ్బందులు తలెత్తకూడదని తాత్కాలిక సిబ్బందితోనే బస్సులను నడిపిస్తున్నారు. అంతే కాక బస్సులు నడిపేవారు తాత్కాలిక సిబ్బంది అవునా కాదా అని గుర్తించేందుకు వారికి సంబంధించిన ఐడీ కార్డులను పరిశీలించి అనంతరం వారిని విధుల్లోకి అనుమతిస్తున్నారు. 



Tags:    

Similar News