Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలకు కొండా మురళి కౌంటర్

BRS VS Congress: నీ అరాచకాలు భరించలేక.. నీ కార్యకర్తలే నా వెంట వస్తారు - కొండా

Update: 2023-06-20 08:23 GMT

Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలకు కొండా మురళి కౌంటర్

BRS VS Congress: ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్‌పై కత్తులు నూరుతున్నారు కాంగ్రెస్ నేత కొండా మురళి. మొన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ప్రెస్ మీట్ పెట్టి మరీ కొండా కౌంటర్ ఇవ్వగా. కొండా వ్యాఖ్యలపై చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్మంటే కొండా మురళి పరకాలలో తనపై పోటీ చేసి గెలవాలంటూ సవాల్ విసిరారు.

చల్లాధర్మారెడ్డి రెడ్డి వ్యాఖ్యలపై కొండా మురళి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చల్లా ధర్మారెడ్డి మట్టిదొంగ అంటూ మురళి విరుచుకుపడ్డారు. పరకాలలో తాను పర్యటిస్తానని. తన అనుచరులు ఉరికించి కొడతారంటూ చల్లా ధర్మారెడ్డిని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ పరకాలలో ఎవరికి టికెట్ ఇచ్చినా. వారి విజయం కోసం పని చేస్తానని. దమ్ముంటే తనను ఆపాలన్నారు.

కొండా మురళి చేసిన ఈ వ్యాఖ్యలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పొలిటికల్ హీట్‌కు కారణమైయ్యాయి. కేటీఆర్ పర్యటన సందర్భంగా ప్రారంభమైన ఈ పొలిటికల్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొండా వ్యాఖ్యలకు బీఆర్ఎస్‌ను నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో చూడాలి .

Tags:    

Similar News