వరంగల్‌ ఏసీపీ వ్యవహారంపై డీజీపీ ఆరా

♦ ఆర్టీసీ ర్యాలీ ఉద్రిక్తతపై hmtvలో వరుస కథనాలు ♦ ఘటనపై కమిషనర్‌ను వివరణ కోరిన డీజీపీ ♦ డీజీపీకి వివరణ ఇచ్చిన వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ♦ ఏసీపీ తీరును సమర్థించిన కమిషనర్‌ ♦ మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించలేదని విరణ ♦ పోలీసుల తీరుపట్ల మహిళా సంఘాల ఆగ్రహం

Update: 2019-10-11 07:33 GMT

 ఆర్టీసీ మహిళా కార్మికులపై పోలీసుల దుశ్చర్య అంటూ hmtv వరుస కథనాలను ప్రసారం చేసింది. దీనిపై పోలీస్‌ ఉన్నతాధికారులు స్పందించారు. రాష్ట్ర డీజీపీ సంఘటనపై ఆరా తీశారు. వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌‌ను ఫోన్‌లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదని హితవు పలికారు. మహిళా కార్మికుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దీనిపై వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ వివరణ ఇచ్చారు. ఏసీపీ ఉద్దేశపూర్వకంగా చేసినది కాదని, మహిళా కార్మికులను రక్షించడానికే ఏసీపీ అక్కడ నిల్చున్నారని తెలిపారు. మహిళల పట్ల ఏసీపీ దురుసుగా ప్రవర్తించలేదని వివరించారు వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌.

Full View

 

Tags:    

Similar News