Sammakka Saralamma Jatara: సంక్రాంతి సెలవులతో మేడారం కిటకిట.. అమ్మవార్ల దర్శనానికి పోటెత్తిన భక్తులు
Sammakka Saralamma Jatara:మేడారంలో పోటెత్తిన భక్తజనం మరికొన్ని రోజుల్లో సమ్మక్క సారలమ్మ జాతర అమ్మవార్ల దర్శనం కోసం ముందస్తుగానే తరలివస్తున్న భక్తులు
Sammakka Saralamma Jatara: సంక్రాంతి సెలవులతో మేడారం కిటకిట.. అమ్మవార్ల దర్శనానికి పోటెత్తిన భక్తులు
తెలంగాణ కుంభమేళాగా పేరు గాంచిన మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరకు భక్తులు ముందుగానే తరలివస్తున్నారు. అభివృద్ధి పనులతో మేడారం కొత్తరూపు సంతరించుకుంది. జాతరకు మరికొన్ని రోజులు గడువు ఉన్నప్పటికీ అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు ముందస్తుగానే మేడారానికి భారీగా తరలివస్తున్నారు. సంక్రాంతి సెలవులు కావడంతో భక్తజనం రద్దీ రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.. పవిత్రమైన జంపన్నవాగులో స్నానాలు ఆచరించి.. ఆ తర్వాత సమ్మక్క-సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకుంటున్నారు. అమ్మవార్లకు బంగారం, చీరలు, సారెలు, గాజులు, ఒడిబియ్యం సమర్పించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నా్రు. ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల మంది పైచిలుకు దర్శనం చేసుకున్నట్టు అంచనా వేస్తున్నారు.