Guru Purnima: సాయిబాబా ఆలయానికి పోటెత్తిన భక్తులు.. కిటకిటలాడుతున్న బాబా ఆలయాలు
Guru Purnima: నిజామాబాద్ జిల్లాలో ఘనంగా గురుపూర్ణిమ వేడుకలు
Guru Purnima: సాయిబాబా ఆలయానికి పోటెత్తిన భక్తులు.. కిటకిటలాడుతున్న బాబా ఆలయాలు
Guru Purnima: గురుపూర్ణిమ వేడుకలు నిజామాబాద్ జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. గురుపూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ శివారులోని మాధవ నగర్ బాబా ఆలయానికి వేకువ జామున నుంచే భక్తులు పోటెత్తారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.జిల్లాలోని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గురువు అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమిచ్చేవారని, ఎలాంటి గురువును ఆశ్రయిస్తే జ్ఞానదాహం తీరుతుందో గురుగీత తెలియజేస్తుందని భక్తులంటున్నారు.