కేటీఆర్ వ్యాఖ్యలతో తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం:భట్టి వ్యాఖ్యలపై మండిపడ్డ బీఆర్ఎస్

Telangana Assembly: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన 30 శాతం కమీషన్ వ్యాఖ్యలు తెలంగాణ అసెంబ్లీలో బుధవారం గందరగోళానికి దారితీశాయి.

Update: 2025-03-26 10:20 GMT

కేటీఆర్ వ్యాఖ్యలతో తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం: భట్టి వ్యాఖ్యలపై మండిపడ్డ బీఆర్ఎస్

Telangana Assembly: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన 30 శాతం కమీషన్ వ్యాఖ్యలు తెలంగాణ అసెంబ్లీలో బుధవారం గందరగోళానికి దారితీశాయి. కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ ప్రసంగిస్తూ ఏ పని జరగాలన్నా 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నట్టు మీ నేతలే మాట్లాడుకుంటున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అధికారపార్టీ మండిపడింది.

డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. 30 శాతం కమీషన్ ఎవరు తీసుకుంటున్నారో రుజువు చేయాలని ఆయన సవాల్ చేశారు. ఒకవేళ రుజువు చేయలేకపోతే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి పోతే బిల్లులు రాకుండా ఇబ్బందులు పడినట్టు చెప్పారు.

ఉన్నతమైన ఆలోచనలతో రాజకీయాల్లోకి వచ్చినవారే ఇక్కడ వైపే ఉన్నారన్నారని డిప్యూటీ సీఎం తెలిపారు. మాట్లాడే ముందు బాధ్యతగా ఉండాలని భట్టి చెప్పారు. ఒళ్ల దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. ఏది పడితే అది మాట్లాడొద్దని భట్టి విక్రమార్క అన్నారు. అయితే భట్టివిక్రమార్క వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ సమయంలో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ సమయంలో బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీ నాలుగో గేట్ వద్ద బైఠాయించి నిరసనకు దిగారు. ఇదిలా ఉంటే కేటీఆర్ చేసిన 30 శాతం కమీషన్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

Tags:    

Similar News