Dalita Bandhu: నేటి నుంచి హుజురాబాద్‌లో దళిత బంధు సర్వే

* మండలంలో 11 క్లస్టర్లు ఏర్పాటు * ప్రత్యేక అధికారులతో 32 బృందాలు * ప్రతి ఇంటికీ క్లస్టర్ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్

Update: 2021-08-27 06:30 GMT

కెసిఆర్ (ఫైల్ ఫోటో)

Dalita Bandhu: హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసింది. హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ఉంది. ఈ మండలంలో దళిత బంధు పథకాన్ని పక్కాగా అమలు చేసేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 20 వేలకు పైగా కుటుంబాలకు దళిత బంధు ప్యాకేజీ అందనుంది. సుమారు 400 మంది అధికారులు ఇంటింటి సర్వేలో భాగంగా నేటి నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

దళిత బంధు ఇంటింటి సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. సుమారు 20వేల కుటుంబాలను గుర్తించి 10 లక్షల రూపాయల చొప్పున దళిత బంధు పథకం కింద లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పారు.

దళిత బంధు కోసం నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబాన్నీ అధికారులు వ్యక్తిగతంగా కలిసి వివరాలు సేకరిస్తారని సీఎం ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జా చెప్పారు. దళిత బంధు ఖాతాను ప్రత్యేకంగా ఓపెన్ చేస్తున్నామని, సర్వేకు అధికారులు వెళ్లిన రోజే ఇది జరిగిపోతుందని తెలిపారు.

Tags:    

Similar News