Revanth Reddy: దళిత, గిరిజన, బీసీలందరికీ ఇక నుంచి ఒకే చేట ప్రభుత్వ ఇళ్లు
Revanth Reddy: డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్‌ను ప్రారంభించిన సీఎం
Revanth Reddy: దళిత, గిరిజన, బీసీలందరికీ ఇక నుంచి ఒకే చేట ప్రభుత్వ ఇళ్లు
Revanth Reddy: డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ ఎన్నో సంస్కరణలకు కృషి చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ భవన్‌ను సీఎం ప్రారంభించారు. గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్, ఇళ్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు విడివిడిగా ఉండేవని, ప్రస్తుతం దళితులు, గిరిజనులు, బీసీ మైనార్టీలందరికీ ఒకేచోట ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఒకే క్యాంపస్‌లో గురుకులాలన్నీ ఉండేలా ఏర్పాటు చేసి, కులాల మధ్య అంతరాలు చెరిపేయాలనుకుంటున్నామని స్పష్టం చేశారు.