Congress: 16న హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ కీలక భేటీ..

Congress: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎలక్షన్స్ పై చర్చ

Update: 2023-09-04 14:34 GMT

Congress: 16న హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ కీలక భేటీ..

Congress: హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ హైకమాండ్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా హస్తం అగ్రనేతలు సోనియా, రాహుల్, ఖర్గేకి కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకంతో హైదరాబాద్‌లో CWC మీటింగ్ ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు రేవంత్. ఈ సమావేశాన్ని విజయవంతం చేస్తామన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది కాంగ్రెస్. ఎన్నికలకు టైం దగ్గర పడుతుండటంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా తొలిసారి హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. దీంతో పాటు సెప్టెంబర్ 17న కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. దీంతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ను రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, ఏఐసీసీ సెక్రటరీలు పరిశీలించారు.

సీడబ్ల్యూసీ సమావేశంపై మీడియాతో చిట్ చాట్ లో కీలక వ్యాక‌్యలు చేశారు రేవంత్. ఈనెల 6న హైదరాబాద్ కు కేసీ వేణుగోపాల్ వస్తారని, సీడబ్ల్యూసీ సమావేశాలపై పలు సూచనలు చేస్తారని చెప్పారు. సీడబ్ల్యూసీ సమావేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎలక్షన్స్ , పొత్తులు, వ్యూహాలు, కాంగ్రెస్ బలోపేతంపై నిర్ణయాలు ఉంటాయన్నారు.


Tags:    

Similar News