Municipal Elections 2020: ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్ శ్రీధర్

మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ శ్రీధర్ అధికారులను ఆదేశించారు.

Update: 2020-01-22 11:56 GMT

నాగర్ కర్నూల్: మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. రిసెప్షన్, కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాట్లపై అధికారులతో ఆయన ఎన్నికల కంట్రోల్ రూంలో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈనెల 25 తేదీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ కి సంబంధించి రిసెప్షన్‌, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్‌ కేంద్రాన్ని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో, కొల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి రిసెప్షన్ స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం కొత్త గ్రంథాలయ భవనంలో, కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించి రిసెప్షన్ స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున బీఈడీ కళాశాలలో ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.

ఓట్ల లెక్కింపు పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఒక్క రౌండుకు ఎనిమిది వార్డుల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగాలన్నారు. అదేవిధంగా మూడు మున్సిపాలిటీ పరిధిలోని స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సాయి శేఖర్, మున్సిపల్ కమిషనర్ జయంత్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి డి మధుసూదన్ నాయక్, జిల్లా అధికారులు అంజిలప్ప మోహన్ రెడ్డి, గోవిందరాజులు, అనిల్ ప్రకాష్, అఖిలేష్ రెడ్డి, ఎర్రి స్వామి, మురళి, ఈడిఎం నరేష్, మున్సిపల్ ఇంజనీర్లు ప్రశాంత్ గౌడ్, ప్రసాద్, రమేష్, శివ, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News