క్వారంటైన్‌లో యువకుడు ఆత్మహత్యాయత్నం

ప్రాణ భయంతో క్వారంటైన్ లో ఉన్న ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Update: 2020-04-19 06:39 GMT
Representational Image

ప్రాణ భయంతో క్వారంటైన్ లో ఉన్న ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కంద్రంలో చోటు చేసుకుంది. ఇటీవల ఢిల్లీ మర్కజ్ వెళ్లొచ్చిన వారికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. వారిలో కొమురం భీం జిల్లాకు చెందిన వారు కూడా ఉన్నారు. కాగా వారందరిని గుర్తించి వైద్యఅధికారులు క్వారంటైన్ కు తరలించారు. కాగా శనివారం ఆ కేంద్రంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. కాగా ఆ వార్డులో ఉన్న ఓ యువకుడు భయపడి తనను వేరే వార్డుకు తరలించాలని అధికారులను కోరాడు. కాగా అధికారులు యువకుడిని పట్టించుకోకపోవడంతో ఆ యువకుడు వార్డులోనే ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన వైద్య సిబ్బంది, అధికారులు వెంటనే అతన్ని వేరో చోటికి తరలించారు.

ఇక ఇప్పటివరకూ కొమురంభీం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకి చేరింది. వారిలో ఓ ఐదేళ్ల చిన్నారి కూడా ఉన్నాడు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసులు 809 నమోదు కాగా, వారిలో 186 మంది కోలుకుని డిశ్చర్జి అయ్యారు. 18 మంది మృతి చెందారు. మరో 605 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక అదే విధంగా భారత దేశంలో ఇప్పటి వరకు 15712 కేసులు నమోదు కాగా వారిలో 507 మంది మృతి చెందారు. 2231 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 12969 మంది కరోనా బాధితులు వైద్యం తీసుకుంటున్నారు.


Tags:    

Similar News