డాక్టర్‌ను అపార్ట్‌మెంట్‌లోకి రానివ్వకుండా అవమానం.. కేసు నమోదు

తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే, ఆపదకాలంలో వైద్యం చేసి మానవునికి పుర్జన్మనిచ్చేది వైద్యుడు.

Update: 2020-04-25 05:56 GMT
Police Complaint

తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే, ఆపదకాలంలో వైద్యం చేసి మానవునికి పుర్జన్మనిచ్చేది వైద్యుడు. ప్రస్తుత సమయంలో ప్రపంచంలో విజృంభిస్తున్న వైరస్ నుంచి ఎంతో మందికి వైద్యం చేసి, వారి ప్రాణాలను కపాడుతున్నారు. సమస్త ప్రాణకోటిని కాపాడే ఆ దేవుడు కూడా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తూ మానవాళిని అతలాకుతలం చేస్తున్న వైరస్ పారదోలకుండా గుడిలోనే ఉన్నాడు. కానీ ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి వారు అనారోగ్యం పాలవుతాం అని తెలిసినా కూడా ప్రజలకు వైద్యం అందించి కాపాడుతున్నారు. వైద్య వృత్తిని అంకిత భావంతో నిర్వర్తిస్తూ సమాజానికి వారి వంతు సేవలను అందిస్తున్నారు. సంవత్సరానికి 365 రోజులు రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రజల ఆరోగ్యం కోసం పాటుడతారు వైద్యులు, అర్థరాత్రి తలుపుతట్టి అర్థిస్తే చీకటిని సైతం లెక్క చేయకుండా రోగి కోసం ఆలోచిస్తారు.

కానీ కొంత మంది మాత్రం వైద్యుల ఔనత్యాన్ని తెలుసుకోలేక వారిపై దాడులు చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు ధూషిస్తూ అవమానిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే హైదరాబాద్ నగరంలోని వనస్థలి పురంలో చోటు చేసుకుంది. ఓ లేడీ డాక్టర్ వనస్థలిపురంలో తన సోదరుడు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లబోతున్న సమయంలో ఆమెను లోపలికి రాకుండా అపార్ట్ మెంట్ వాసులు అడ్డుకున్నారు. ఆమె లోపలికి రాకూడదని ఆంక్షలు పెట్టారు. ఆమె లోపలికి వస్తే తమకు కరోనా సోకుతుందని అవమానించారు. దీంతో ఆమె వనస్థలిపురం పోలీసులను సంప్రదించి అపార్ట్ మెంటు వాసుల మీద ఫిర్యాదు చేసారు. ఫిర్యాదును అందుకున్న పోలీసులు ఈ ఘటనపై స్పందించి ఐపీసీ 341,188,506,509 సెక్షన్ కింద డాక్టర్‌ను అడ్డుకున్న అపార్ట్‌మెంట్‌వాసులపై కేసులు నమోదు చేశారు.

ఇలాంటి విషయాలపై తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. డాక్టర్లపై జరుగుతున్న దాడుల అంశాన్ని ప్రస్తావించారు. రోగులు కానీ, వారి బంధువులు కానీ వైద్యుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే కేంద్రం తెచ్చిన కొత్త ఆర్డినెన్స్ ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి దాడులను నియంత్రించడానికి ఎపిడ‌మిక్ డిసీజ్ యాక్ట్-1897 సవరణ చేసి, నాన్ బెయిల‌బుల్ కేసు నమోదు చేసేలా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు.

 


Tags:    

Similar News