ఆదిలాబాద్ జిల్లాలో తొలి కరోనా కేసు

ఆదిలాబాద్ జిల్లాకు కూడా కరోనా సెగ తాకింది. జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయింది.

Update: 2020-04-04 08:39 GMT
Representational Image

ఆదిలాబాద్ జిల్లాకు కూడా కరోనా సెగ తాకింది. జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. ఇటీవలే ఢిల్లీ మర్కజ్‌లోని మత ప్రార్థనల్లో పాల్గొని తిరిగి ఉట్నూర్ మండలం హస్నాపూర్‌ గ్రామానికి తిరిగి వచ్చిన (24) ఏళ్ల యువకుడికి పాటిజివ్‌గా నిర్థారణ అయింది. ఈ యువకుడు ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి మార్చి 18 స్వగ్రామానికి వచ్చారు. కాగా అతన్ని ఈ నెల 2న అధికారులు ఆదిలాబాద్ మండలం చాందా (టి ) సమీపంలో ని క్వారంటైన్ కు తరలించారు. అతని రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం పింపించారు.

ఈ పరీక్షల్లో యువకునికి పాజిటివ్ వచ్చినట్లు సీసీఎంబీ ల్యాబోరేటరీ నిర్ధారించింది. దీంతో అప్రమత్తమయిన వైద్యులు వెంటనే అతన్నిహైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతనితో పాటు అతని 15 మంది కుటుంబ సభ్యులను కూడా చాందా (టి ) క్వారంటైన్ కు తరలించారు. ఆ యువకుడు ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత ఎవరెవరిని కలిసారు, ఎక్కడికి వెల్లాడు అన్న విషయాలను అధికారులు ఆరా తీస్తున్నారు. అంతే కాక అతని స్వస్థలాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. అంతే కాక కరోనా అనుమానితులను క్వారంటైన్ కి తరలిస్తున్నారు.

ఇక పోతే ఇప్పటికే ఢిల్లీకి వెల్లి వచ్చిన వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ రావడంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో అధికారులు ఢిల్లీలో జరిగిన మతపరమైన ప్రార్థనలకు వెళ్లివచ్చిన 67 మందిని గుర్తించి వారిని వెంటనే క్వారంటైన్‌కు తరలించారు. దీంతో జిల్లాలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొంటున్నాయి. క్వారంటైన్ కు పంపించిన వారి రక్తనమూనాలను పరీక్షల కోసం హైదరాబాద్‌కు పంపించారు. కాగా రిపోర్టుల్లో ఏవిధంగా ఫలితం వస్తుందో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఉచిత బియ్యాన్ని టోకెన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. బియ్యం తీసుకునే సమయంలో ప్రతి ఒక్కరు సామాజిక దూరాన్ని పాటించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.


Tags:    

Similar News