Bandru Shobharani: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి కాంగ్రెస్ మహిళానేత శోభారాణి స్ట్రాంగ్ కౌంటర్
Bandru Shobharani: మహిళలను తక్కువ చేసి మాట్లాడితే చెప్పు దెబ్బలు తప్పవు
Bandru Shobharani: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి కాంగ్రెస్ మహిళానేత శోభారాణి స్ట్రాంగ్ కౌంటర్
Bandru Shobharani: ఒకరు చీరలు, గాజులు చూపిస్తే.. మరొకరు చెప్పులు చూపించి వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజుకుంటోన్న రచ్చ ఇది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు చీరలు, గాజులు వేసుకోవాలన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికు అంతే రేంజ్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నాయకురాలు శోభారాణి. పాడి కౌశిక్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ఎన్నికల్లో మహిళలను అడ్డుపెట్టుకొని గెలిచిన చరిత్ర నీదని ఎద్దేవా చేశారు. మరోసారి మహిళలను తక్కువ చేసి మాట్లాడితే చెప్పు దెబ్బలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించాలని కోరారు. ఆయన శాసనసభ సభ్యత్వం కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.