పోలీసుల నిర్బంధం కోసం తెలంగాణ సాధించామా : కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

ఉపాధ్యాయుల సమస్యలు, పీఆర్సీపై ప్రభుత్వం స్పందన తగ్గిందని, ప్రభుత్వం ఉపాధ్యాయులపై శ్రద్ద చూపించడంలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. శుక్రవారం జరగనున్న అసెంబ్లీ సమావేశానికి ఆయన హాజరయ్యారు.

Update: 2020-03-13 07:22 GMT
Congress MLC Jeevan Reddy (File Photo)

ఉపాధ్యాయుల సమస్యలు, పీఆర్సీపై ప్రభుత్వం స్పందన తగ్గిందని, ప్రభుత్వం ఉపాధ్యాయులపై శ్రద్ద చూపించడంలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. శుక్రవారం జరగనున్న అసెంబ్లీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మండల స్థాయి విద్యా విధానం నిర్వీర్యం అవుతుందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే అన్ని రాష్ట్రాల్లో విద్యావిధానం సక్రమంగా ఉందని, తెలంగాణలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో మూడో డీఎస్సీ నిర్వహిస్తోందని తెలిపారు.

ఢిల్లీ ప్రభుత్వం విద్య, వైద్య విధానం ప్రజల మెప్పుపొందుతుందని ఆయన స్పష్టం చేసారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలనా విధానాన్ని విడనాడాలన్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమం కోసం ఉపాధ్యాయులు లీవ్‌ అడిగారని, అయినా వారికి లీవ్ ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. ఉపాధ్యాయులు తలపెట్టిన చలో అసెంబ్లీ అడ్డుకునే విధంగా పోలీసుల ముందస్తు అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పోలీసుల నిర్బంధం కోసం తెలంగాణ సాధించామా అని ఆయన ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రం 27 శాతం మధ్యంతర భృతి అమలు చేస్తోందన్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, పోస్టుల భర్తీని ప్రభుత్వ వెంటనే చేపట్టాలని ఆయన కోరారు.

Tags:    

Similar News