రాష్ట్ర ఎలక్షన్ కమిషన్‌పై మధుయాష్కీ తీవ్ర విమర్శలు

Update: 2020-11-30 12:08 GMT

రాష్ట్ర ఎలక్షన్‌ కమిషన్‌ తీరుపై ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ మండిపడ్డారు. ఎలక్షన్‌ కమిషన్‌ అధికారపార్టీకి అటెండర్‌గా మారిందని విమర్శించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ ప్రతీ డివిజన్‌కు 5కోట్లు ఖర్చు చేస్తుందని మధుయాష్కి ఆరోపించారు. టీఆర్ఎస్ గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే దిక్కులేదు. కొత్తగా హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతోందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రతీ డివిజన్‌కు ఐదు కోట్లు ఖర్చు చేస్తోందని, ఇవి గ్రేటర్ అభివృద్ధికి ఖర్చుపెడితే బాగుండేదని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో అభివృద్ధి చేసే పార్టీకే ప్రజలు మద్దతు తెలపాలని మధుయాష్కీగౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌తోనే హైదరాబాద్‌లో అభివృద్ధి జరిగిందని ఓటర్లు గుర్తించుకోని ఓటేయాలని చెప్పారు.

Tags:    

Similar News