తెలంగాణలో కూడా రివర్స్‌ టెండరింగ్‌ తీసుకురావాలి

Update: 2019-09-24 10:49 GMT

కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే తెలంగాణ కూడా రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమలు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. ఏపీలోని ప్రాజెక్టుల విషయంలో జరిగిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందించడాన్ని భట్టి విక్రమార్క స్వాగతించారు. రాష్ట్రంలో కూడా జ్యూడిషియరీ కమిటీ వేసి టెండరింగ్ పర్యవేక్షణ జరగాలన్నారు. ఇప్పటివరకు ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కోసం లక్షా 50 వేల కోట్లు ఖర్చే చేశారని మరో లక్ష కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందన్న భట్టి విక్రమార్క రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా వేల కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. 

Tags:    

Similar News