రాహుల్ పర్యటనకు ముందే స్పీడ్ పెంచిన కాంగ్రెస్

Congress: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ నేతల చూపు

Update: 2023-10-17 05:33 GMT

రాహుల్ పర్యటనకు ముందే స్పీడ్ పెంచిన కాంగ్రెస్

Congress: నిజామాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. రాహుల్‌గాంధీ పర్యటనకు ముందే కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ వల వేస్తోంది. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు ఆకుల లలిత, ఏనుగు రవీందర్ రెడ్డి పక్క చూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆకుల లలిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. 20న నిజామాబాద్ జిల్లాలో రాహుల్ పర్యటించనున్నారు. రాహుల్ పర్యటన సందర్భంగా భారీగా చేరికలు ఉండనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ సమక్షంలో ఆకుల లలిత పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే బోధన్ మున్సిపల్ ‍ఛైర్మన్ దంపతులు కాంగ్రెస్‌లో చేరారు.

Tags:    

Similar News