కరోనా నివారణకు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి: కలెక్టర్ కె.శశాంక

Update: 2020-04-10 17:51 GMT
k shashanka

కరీంనగర్ లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రాబోవు రోజులలో, రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం ఉధృతంగా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, దాని నివారణగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, జిల్లాలో కరోనా వైరస్ అవకాశాలు నివారణకు, ప్రతి ఒక్కరు తప్పని సరిగా మాస్కులు ధరించాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక ఒక ప్రకటనలో తెలిపారు.

చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా ఇండ్ల నుండి బయటకు వెళ్లే సమయంలో, ప్రతి ఒక్కరు మూతి, ముక్కు మరియు చెంపలు పూర్తిగా మూసి ఉండే విధంగా మాస్కులు ధరించాలని ఆయన అన్నారు. అవసరమైన మాస్కులను మెప్మా, స్వయం సహాయక సంఘాల వారు తయారు చేసి తక్కువ ధరకు అందిస్తారని, లేనిచో మన ఇండ్లలో ఉండే తెల్లని కాటన్ క్లాత్ ను రెండు మడతలుగా మలిచి మాస్కులు తయారు చేసుకొని ఉపయోగించాలని ఆయన అన్నారు.

ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోని అధికారి, సిబ్బంది అందరు మాస్కులు ధరించి రావాలని, అలాగే తిరిగి ఇంటికి వెళ్లే వరకు వాటిని తీయవద్దని, గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, జిల్లా యంత్రాంగం చేసే సూచనలు పాటించి సహకరించాలని, అలాగే మాస్కులు పూర్తిగా మెడ వరకు కవరు చేసే విధంగా ఉండాలని, మాస్కు వేసుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కుని వేసుకోవాలని, ఒకసారి ఉపయోగించిన మాస్కును మరోసారి వేసుకోవాలంటే తప్పనిసరిగా నీటిలో శుభ్రపరిచి, తిరిగి ధరించాలని, మాస్కును ధరించి తీసివేసిన సమయంలో, శానిటైజర్ తో 40 సెకన్ల వరకు చేతులు శుభ్రం చేసుకోవాలని, అలాగే కాటన్ క్లాత్ తో తయారు చేసుకున్న మాస్కులను వెచ్చని నీటిలో 15 నిమిషాల పాటు నానబెట్టి, సబ్బు లేదా లేదా డెటాయిల్ తో శుభ్రం చేసిన తదుపరి, దానిని ఇస్త్రీ చేసి పొడి ప్రదేశంలో భద్రపరుచుకోవచ్చని ఆయన అన్నారు. 

Tags:    

Similar News