Siddipet: భార్య, పిల్లలను చంపి.. కలెక్టర్‌ గన్‌మెన్‌ ఆత్మహత్య

Siddipet: అనంతరం తానూ కాల్చుకుని సూసైడ్ చేసుకున్న నరేష్

Update: 2023-12-15 07:14 GMT

Siddipet: భార్య, పిల్లలను చంపి.. కలెక్టర్‌ గన్‌మెన్‌ ఆత్మహత్య

Siddipet: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్లలో దారుణం చోటు చేసుకుంది. అప్పుల బాధతో ఓ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను గన్‌తో కాల్చి చంపి అనంతరం తాను కూడా సూసైడ్ చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వద్ద గన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న నరేష్‌ తన భార్య చైతన్య, పిల్లలు రేవంత్, హిమశ్రీలను ఇంట్లోనే గన్‌తో కాల్చి చంపాడు. చిన్నారులు స్కూల్‌కు వెళ్లే సమయానికి ఇంటికి చేరుకున్న నరేష్ కుటుంబసభ్యులను గన్‌తో కాల్చి చంపాడు.

అనంతరం తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు ఉదయం పది గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆత్మహత్యకు అప్పుల బాధలే కారణని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News