ఎల్లుండి నుంచి గజ గజ

Update: 2020-01-03 12:36 GMT
చలి

చలి పీక్‌కి చేరింది. ఎముకలు కొరికే చలిలో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో తెలంగాణ లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిణి నాగరత్నం తెలిపారు. ఈనెల 5 తర్వాత చలి తీవ్రత పెరుగుతుందని చెప్పారు. దక్షిణ ఆగ్నేయం గుండా వీస్తున్న తేమగాలులతో వాతవరణంలో మార్పులు సంభవిస్తున్నాయని వాతవరణశాఖ అధికారిణి నాగరత్నం తెలిపారు.

Full View

Tags:    

Similar News