Revanth Reddy: మేడారంలో అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Revanth Reddy: మేడారం అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. మేడారంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించలాన్నారు. అధికారులు, ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ, దేవాదాయ శాఖ, అటవీ శాఖ, స్థపతి శివనాగిరెడ్డి సమన్వయంతో పనులు చేయాలని సూచించారు సీఎం. అభివృద్ధి పనుల్లో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేయాలన్నారు. నిర్దేశిత సమయంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.