Revanth Reddy: ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: జనవరి 15 నుంచి 19 వరకూ సదస్సు
Revanth Reddy: ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: స్విట్జర్లాండ్‌లో జరిగే ప్రతిష్టాత్మక 54వ ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. జనవరి 15-19 వరకు దావోస్‌లో ఈ సదస్సు జరగనుంది. వందకు పైగా దేశాల నుంచి రాజకీయ, వ్యాపార దిగ్గజాలు ఇందులో పాల్గొంటారు. రాష్ట్రం నుంచి సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర అధికారులు వెళ్లనున్నారు. రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.