Arvind Dharmapuri: రాష్ట్రాన్ని రోహింగ్యాలకు అడ్డాగా మార్చాలని ఉత్తమ్ అనుకుంటున్నారా?
Arvind Dharmapuri: పార్లమెంట్ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది
Arvind Dharmapuri: రాష్ట్రాన్ని రోహింగ్యాలకు అడ్డాగా మార్చాలని ఉత్తమ్ అనుకుంటున్నారా?
Arvind Dharmapuri: CAA అమలు చేయమని ఉత్తమ్ కుమార్ ఏ హోదాలో చెబుతున్నారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. పార్లమెంట్ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు పాకులాడుతున్నారని ఆక్షేపించారు. సీఏఏ చట్టాన్ని ప్రతిపాదించిందే కాంగ్రెస్ నేతృత్వంలోని నెహ్రు అని చెప్పారు. సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు, భారత ముస్లింలకు సంబంధం లేదన్నారు. రాష్ట్రాన్ని రోహింగ్యాలకు అడ్డాగా మార్చాలని ఉత్తమ్ అనుకుంటున్నారా అని నిలదీశారు. ఉత్తమ్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని అరవింద్ డిమాండ్ చేశారు.