Telangana Schemes: ఒకేసారి 4 పథకాలు ప్రారంభం.. ఇవాళ మంత్రులు అధికారులతో సీఎం రేవంత్ కీలక సమావేశం..!
Telangana - 4 Schemes Launch: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
Telangana Schemes: ఒకేసారి 4 పథకాలు ప్రారంభం.. ఇవాళ మంత్రులు అధికారులతో సీఎం రేవంత్ కీలక సమావేశం..!
Telangana - 4 Schemes Launch: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రేపటి నుంచి ప్రారంభించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు. ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులపై ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్షించనున్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావుతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులతో పాటు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఫైనాన్స్, అగ్రికల్చర్, రెవెన్యూ, హౌసింగ్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
పథకాల వివరాలు చూస్తే.. రైతు భరోసా కింద.. వ్యవసాయ యోగ్యమైన భూములు ఉన్న రైతులకు సంవత్సరానికి ఎకరానికి రూ.12,000 చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతోంది. అలాగే భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి రూ.12,000 ఇవ్వబోతోంది. ఇందులో తొలి విడతగా జనవరి 26న రూ.6,000 చొప్పున ఇవ్వనుంది.
ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వస్తే.. స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5,00,000 చొప్పున ప్రభుత్వం 4 విడతల్లో మనీ ఇస్తుంది. ఇలా తొలి దశలో ఈ పథకంలో భాగంగా.. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున నిర్మాణానికి మనీ ఇవ్వనుంది. ఇక 40 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతోంది. ఐతే.. ఇవన్నీ పూర్తిగా కొత్తవి కావు. వీటిలో మార్పులు చేయించుకున్న రేషన్ కార్డులు కూడా ఉంటాయి.