Revanth Reddy: తెలంగాణ రైజింగ్‌లో రెండు ప్రధాన అంశాలు
Revanth Reddy: అభివృద్ధి చెందిన తెలంగాణను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
Revanth Reddy: తెలంగాణ రైజింగ్‌లో రెండు ప్రధాన అంశాలు
Revanth Reddy: అభివృద్ధి చెందిన తెలంగాణను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ర్ట భవిష్యత్ కోసం పారదర్శక పాలసీలు తీసుకురానున్నట్టు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై మంత్రులు, అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇవాళ, రేపు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ను మంత్రులు, సంబంధిత విభాగాల అధికారులు తమ శాఖ పరిధిలోని ప్రతి అంశాన్ని చర్చించి క్షుణ్ణంగా ఆధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
విజన్ డాక్యుమెంట్ తో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయని.. ఒకటి విజన్ అయితే.. ఇంకోటి స్ట్రాటజీ అన్నారు. ఈ డాక్యుమెంట్ రూపకల్పనలో ప్రముఖులు, నిపుణుల సలహాలు తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. స్ట్రాటజీలో భాగంగా తెలంగాణను మూడు విభాగాలుగా తీసుకున్నామన్నారు. 2047 నాటికి రాష్ర్టాన్ని మూడు ట్రిలియన్ ఎకానమీగా మారుస్తామని స్పష్టం చేశారు.