Revanth Reddy: లోకసభ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
Revanth Reddy: సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్యనేతలతో రేవంత్ భేటీ
Revanth Reddy: లోకసభ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
Revanth Reddy: కాంగ్రెస్ జనజాతర సభ సక్సెస్ కావడంతో లోకసభ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. వరుసగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. 14 పార్లమెంట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. కాసేపటి క్రితమే వరంగల్‌కు చెందిన నేతలతో సీఎం సమావేశమయ్యారు. తాజాగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, అజహరుద్దీన్, కార్పొరేటర్ విజయలక్ష్మి సహా మరికొందరు నేతలు హాజరయ్యారు.