Revanth Reddy: పార్టీలో అంతర్గతంగా మాట్లాడితే ఎడిట్‌ చేసి ప్రచారం చేస్తున్నారు

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో తమ కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Update: 2025-12-03 08:43 GMT

Revanth Reddy: పార్టీలో అంతర్గతంగా మాట్లాడితే ఎడిట్‌ చేసి ప్రచారం చేస్తున్నారు

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో తమ కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

పార్టీ నాయకుడిగా ఎలా పనిచేయాలనే విషయాన్ని వివరించే క్రమంలో తాను డీసీసీ అధ్యక్షులతో మాట్లాడినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. "కాంగ్రెస్ పార్టీని హిందూ సమాజంలాంటిదే" అని తాను డీసీసీ అధ్యక్షులకు వివరించానని తెలిపారు. ఈ అంతర్గత సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలను విపక్షాలు ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

తన వ్యాఖ్యలను బీజేపీ వివాదం చేయడాన్ని సీఎం రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో డిపాజిట్ కోల్పోయిన బీజేపీ, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ వివాదాన్ని సృష్టిస్తోందని విమర్శించారు.

"నా పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఉత్తర భారతంలో కూడా నన్ను పాపులర్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది," అని విపక్షాలపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News