Revanth Reddy: ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

Revanth Reddy: గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు సీఎం రేవంత్. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి పేదల ఆశలను అడియాలను చేసిందని విమర్శించారు.

Update: 2025-11-19 08:49 GMT

Revanth Reddy: ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

Revanth Reddy: గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు సీఎం రేవంత్. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి పేదల ఆశలను అడియాలను చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మహిళలను భాగస్వామ్యులను చేస్తున్నామని అన్నారు.

భారత ప్రధానిగా ఇందిరాగాంధీ ఎనలేని సేవలందించారని అన్నారు సీఎం రేవంత్. బలహీన వర్గాలకు ఇందిరమ్మ పాలన సువర్ణ అధ్యాయమని సీఎం రేవంత్ చెప్పారు. ఇందిరా గాంధీ స్పూర్తితో రాష్ట్రంలో ప్రజా పాలన చేస్తున్నామని, మహిళలకు స్థానిక సంస్థల్లో ప్రాతినిథ్యం ఇస్తున్నామని సీఎం ప్రస్తావించారు. ఇందిరా గాంధీ పాలన దేశానికి దిక్సూచి అని సీఎం రేవంత్ కొనియాడారు. మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు.

 

Tags:    

Similar News