మంత్రుల పనితీరుపై అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్న సీఎం రేవంత్‌.. కేబినెట్‌లోని పలువురికి ఉద్వాసన పలికే అవకాశం..

Revanth Delhi Tour: ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. కాసేపట్లో ఏఐసీసీ నేతలతో ఆయన భేటీ కానున్నారు.

Update: 2025-02-15 02:50 GMT

Revanth Reddy: ఆ జిల్లాల్లో వెంటనే రేషన్ కార్డులివ్వండి..సీఎం రేవంత్ ఆదేశం

Revanth Delhi Tour: ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. కాసేపట్లో ఏఐసీసీ నేతలతో ఆయన భేటీ కానున్నారు. ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేతో పాటు.. సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీలను సీఎం రేవంత్‌ కలవనున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే నివేదికను హైకమాండ్‌కు ఆయన సమర్పించనున్నారు. అలాగే మంత్రివర్గ విస్తరణపై కూడా ఏఐసీసీ నేతలతో చర్చించనున్నారు సీఎం. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను వివరించనున్నారు.

మంత్రుల పనితీరుపై కాంగ్రెస్‌ అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు సీఎం రేవంత్‌. ఇదిలా ఉంటే కేబినెట్‌లోని పలువురికి ఉద్వాసన పలికే ఛాన్స్‌ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ టూర్‌లో భాగంగా పలువురు కేంద్రమంత్రులను సీఎం రేవంత్‌ కలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం. మార్చిలో తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధులు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News