CM KCR: ప్రాజెక్టుల బాటపట్టిన తెలంగాణ సీఎం..

Update: 2020-02-13 04:28 GMT
ప్రాజెక్టుల బాటపట్టిన తెలంగాణ సీఎం..

సీఎం కేసీఆర్‌ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పర్యటనలో భాగంగా తుపాకులగూడెం ఆనకట్టను సీఎం పరిశీలిస్తారు. కాళేశ్వరం వెళ్లి ముక్తేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం మేడిగడ్డపై నిర్మించిన లక్ష్మీ ఆనకట్టను పరిశీలించనున్నారు. ఆనకట్టలో నదీజలాల నిల్వ తీరు, ఆనకట్టకు సంబంధించిన విషయాలు, ఇతరత్రా అంశాలపై అక్కడే ఇంజినీర్లు, అధికారులతో సమీక్షించనున్నారు కేసీఆర్.

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా గోదావరి నది నుంచి మరో టీఎంసీ నీటిని తరలించే అంశంపై దృష్టి సారించారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అక్కడ తుపాకులగూడెం ఆనకట్టను పరిశీలించనున్నారు. తుపాకులగూడెం రిజర్వాయర్‌కు సమ్మక్క బ్యారేజీగా పేరు మార్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను జారీ చేయాల్సిందిగా ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు.

మరోవైపు మేడిగడ్డ రిజర్వాయర్‌లో గోదావరి జలాల నిల్వ తీరు, ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలపై ఇంజినీర్లు, అధికారులతో సీఎం సమీక్షిస్తారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి నది పరిసర ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. లక్ష్మీ ఆనకట్టతో పాటు సరస్వతి, పార్వతి ఆనకట్టల నుంచి ఎల్లంపల్లి వరకు ఉన్న నీటి నిల్వలకు సంబంధించి అధికారులతో కేసీఆర్‌ సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News